108 సిబ్బందికి అభినందనలు
మక్తల్ , అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలంలోని అడివి సత్యారం గ్రామానికి చెందిన రేణుక శనివారం సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ తో పది నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. మార్గమధ్యలో వాడ్వాట్ గేట్ దగ్గర అంబులెన్స్ లోనే ఆమె మగ బిడ్డకు జన్మినిచ్చింది. టెక్నీషియన్ రామాంజనేయులు, డాక్టర్ వినయ్ సూచనలతో అంబులెన్స్ లోనే డెలివరీ చేయడం జరిగింది. తర్వాత ఆమెను మాగనూరు పిహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అత్యవసర సమయంలో 108 సిబ్బంది సకాలంలో స్పందించి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడారని పేషంట్ బంధువులు 108 సిబ్బందిని అభినందించారు.

