పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ

  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ ; జనగామ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా అమలు చేశామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.శనివారం ప్రారంభం అయిన పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబందించి సెట్ కాన్ఫెరెన్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్ లకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పలు సూచనలను చేశారు.

అనంతరం జిల్లా కేంద్రంలోనీ సెయింట్ మేరీస్ స్కూల్ , ధర్మకంచ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు, బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం, సిసి టివి కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి కఠిన చర్యలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, డెస్కులు, సరైన వెలుతురు ఉండేలా చూడాలని,వేసవి తీవ్రత కారణంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
డీసీపీ రాజమహేంద్ర నాయక్….
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని అన్నారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Leave a Reply