Compliments Trump | అత‌గాడు పొగ‌డ్తలు.. ఇత‌గాడు చిరున‌వ్వులు

Compliments Trump | అత‌గాడు పొగ‌డ్తలు.. ఇత‌గాడు చిరున‌వ్వులు

Compliments Trump | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆ ఇద్ద‌రు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఒక దేశాధినేత‌ పొగ‌డ‌తాలతో ముంచెత్తారు.. మ‌రో దేశాధినేత న‌వ్వుల జ‌ల్లు కురిపించారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు ఒక‌రు ప్ర‌పంచంలో అగ్ర‌దేశ‌మైన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మ‌రొక‌రు ఇజ్రాయెల్ దేశాధినేత బెంజ‌మిన్ నెత‌న్యాహు. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహును అమెరికా (America) అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌శంసించారు. ఇందుకు నెత‌న్యాహు కూడా స్పందింస్తూ చిరున‌వ్వులు చిందించారు. ట్రంప్ వంటి మిత్రుడు ఇజ్రాయెల్‌కు మరొకరు లేర‌ని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నేతలు అమెరికాలోని ఫ్లోరిడాలో భేటీ అయ్యారు. గాజా శాంతి ప్రణాళికలో తదుపరి దశను ముందుకుతీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది. గాజా కాల్పుల విరమణ ప్రణాళిక రెండో దశకు వెళ్లేముందు హమాస్ ఆయుధాలను వీడాల్సిందేనని వారిద్ద‌రూ స్పష్టం చేశారు. జనవరిలో గాజాకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ట్రంప్ ప్ర‌ణాళిక‌లో ఒక భాగం. గాజాలో తాను చేస్తున్న శాంతి యత్నాలకు గుర్తింపు రావడంలేదని ట్రంప్ ఆసహనం వ్యక్తం చేశారు.

Compliments Trump | నెతన్యాహు గొప్ప నాయ‌కుడు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ధైర్యవంతుడు, దేశభక్తుడు, గొప్ప నాయకుడిగా ట్రంప్‌ ప్రశంసించారు. వారి భాగస్వామ్యం చారిత్రాత్మకమని, ఇజ్రాయెల్‌ను (Israel) రక్షించడంలో నెతన్యాహు పాత్ర అద్భుతమని, హమాస్‌తో యుద్ధాన్ని గొప్పగా నిర్వహించారని పేర్కొన్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని మారా-లాగోలో సమావేశమైనప్పుడు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడంలో ఇజ్రాయెల్ అద్భుతంగా వ్యవహరించిందని ట్రంప్ అన్నారు. నెతన్యాహు అసాధారణమైన ధైర్యం, దేశభక్తిని కొనియాడారు, ఆయన గొప్ప నాయకుడని అభివర్ణించారు. హమాస్‌తో యుద్ధాన్ని నెతన్యాహు అద్భుతంగా నిర్వహించారని, ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందాన్ని అమలు చేయడంలో ఇజ్రాయెల్ 100% కట్టుబడి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తన ప్రణాళికకు కట్టుబడి ఉందని, ఇతర పార్టీల వైఫల్యాలపై తాను ఆందోళన చెందుతున్నానని ట్రంప్ స్పష్టం

Compliments |Trump

Compliments Trump | నాకు క్రెడిట్ ఇవ్వలేదు

భారత్-పాకిస్థాన్ (India-Pakeen)ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. ఈ సమావేశంలోనూ ఆ అంశం గురించి మాట్లాదారు “దానికి నాకు క్రెడిట్ వచ్చిందా..? లేదు కదా.” అని వాపోయారు. పాక్‌తో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని భారత్ తేల్చి చెప్పినప్పటికి ట్రంప్ క్రెడిట్ తీసుకోవ‌డానికి ఎందుకో ఆరాట ప‌డుతున్నారు. ఇద్ద‌రు నేతలు బేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. “అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే 80 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ జాతీయుడు కాని వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని ఈ సందర్భంగా నెతన్యాహు ప్రకటించారు.

Compliments |Trump

CLICK HERE TO READ  రైలు ప్ర‌మాదం.. 13 మంది దుర్మ‌ర‌ణం

CLICK HERE TO READ MORE

Leave a Reply