Competitions | ఆటలు ఆరంభం

Competitions | ఆటలు ఆరంభం
- సీఎం కప్ మండల స్థాయి పోటీలు ప్రారంభం
Competitions | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో వసంతలక్ష్మి, తహసీల్దార్ రాములుతో కలిసి ప్రారంభించారు. కబడ్డీ, కోకో, వాలీబాల్, యోగా క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పోటీలలో క్రీడాకారులు ప్రతిభ చూపి జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎంపీఓ సునీత, ఎంఈఓ అమృతాదేవి, సర్పంచ్‌లు నామని జగన్నాథం, సింగం వెంకటేశం, భీమనపల్లి రామయ్య, పంకెర్ల ప్రభాకర్, రావుల స్వప్న రమేష్, ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, కంచుకట్ల సుదర్శన్, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
