గూడ్స్ రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
కేసముద్రం, ఆంధ్రప్రభ: గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని గాయత్రిగుట్టకు చెందిన వరం శెట్టి దీపక్ (19) కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్దయి చెరువు వద్ద గూడ్స్ రైలు కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
