Commissionerate | అత్యుత్తమ సేవలందిస్తాం..

Commissionerate | అత్యుత్తమ సేవలందిస్తాం..
- ఓరుగల్లు వాసుల మనస్సులు గెలుస్తాం
- శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే తాట తీస్తాం
- వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
- పోలీస్ కమిషనరేట్ లో నూతన సంవత్సర వేడుకలు
Commissionerate | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : వరంగల్ పోలీసులు ప్రజలకు అత్యుత్తమ సేవలందించడానికి పోటీలు పడి పని చేస్తారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పోలీసులు తమ పనితీరుతో ఓరుగల్లు వాసుల మనస్సులు గెలిచే రీతిలో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనరేట్(Commissionerate) పరిధిలో ఎవ్వరైనా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తే తాట తీస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ క్యాంప్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు ప్రభుత్వ అధికారులు(officials), పాఠశాల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు, మొక్కలను అందజేశారు.
ఈసందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… ఈ ఏడాది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. పోలీస్ ఆఫీసర్స్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తమ ఆరోగ్యం పట్ల పోలీస్ అధికారులంతా శ్రద్ద వహించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజ మహేంద్ర నాయక్, దార కవిత ఏఎస్పీ శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర(Trainee IPS Manisha Nehra), అదనపు డీసీపీలు రవి, రాయల ప్రభాకర్ రావు, బాలస్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్ లతో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఎస్ లు, ఎస్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

