కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ.

కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ.

.స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్‌కుమార్ .
. స్లాట్ సేవలపై ప్రత్యేక పరిశీలన.
కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ . కర్నూలు జిల్లా కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలకు సకాలంలో సేవలు అందుతున్నాయా? అనే అంశంపై ఆయన ప్రత్యేకంగా ఈ కెపరిశీలించారు.
స్లాట్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు వచ్చిన పౌరులకు 15 నిమిషాల లోపే దస్తావేజులు అందజేస్తున్న విధానంను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సమయపాలనతో సేవలు అందించాలంటూ సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు కార్యాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ శాఖలో సేవల విషయంలో ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే, ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని డీఐజీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌లు శ్రీనివాసరావు, ప్రవీణ్ పాల్గొన్నారు.

Leave a Reply