Collector | నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

Collector | నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Collector | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్(District Collector) మాట్లాడుతూ… పోస్టుమార్టం గది నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని అవుట్ పేషంట్, ల్యాబ్, వార్డులు, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఓ. పి. లో నమోదు అవుతున్న అనారోగ్య సమస్యల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరిస్తూ సాంకేతిక పరికరాలను సమకూర్చి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుత వాతావరణం దృష్ట్యా అధికంగా వచ్చే జలుబు, జ్వర పీడితులకు వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
