బీజేపీ సమావేశంలో వివరాలు సేకరణ
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్(ZPTC, MPTC, Sarpanch) పదవులకు పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారు వివరాలు ఇవ్వాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి కోరారు. ఈ రోజు కమ్మర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆశావహుల వివరాల సేకరణ కోసం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అన్ని గ్రామాల కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఆయా గ్రామాలలో అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. గ్రామాల వారీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల జాబితాను రూపొందించినట్లు వివరించారు. ఆసక్తా ఉన్న వారి పేర్లతో జాబితాను అధిష్టానానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.