Collapse | గుజరాత్‌లో కుప్పకూలిన మరో వంతెన .. డబుల్ ఇంజన్ స‌ర్కార్ పై కెటిఆర్ గ‌రం గ‌రం

గాంధీన‌గ‌ర్ – గుజ‌రాత్ లో (gujarath ) మోర్బీ వంతెన (morchi bridge ) కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే, డబుల్ ఇంజన్ (double engine ) బీజేపీ సర్కార్ ఉన్న గుజరాత్‌లో మరో వంతెన నదిలో కూలిపోయింది. ని పద్రా సమీపంలో మహిసాగర్ నదిపై నిర్మించిన ‘గంభీర’ వంతెన బుధవారం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటన సమయంలో వంతెనపై ఉన్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని సురక్షితంగా కాపాడాయి. నదిలో గల్లంతైన మరికొందరి కోసం పోలీసులు, సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అంటే కూల‌డ‌మేనా – కెటిఆర్

గుజరాత్‌లో మరో వంతెన కుప్పకూలిన ఘటనపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ ప్రచారం చేసుకునే ‘డబుల్ ఇంజిన్ గుజరాత్ మోడల్‌’కు మరో ఉదాహరణ అంటూ ‘ఎక్స్ ‘ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. గతంలో మోర్బీ వంతెన కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, ఇది మరో షాక్‌కు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. “డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్న గుజరాత్, బీహార్‌లలోనే తరచూ వంతెనలు ఎందుకు కూలుతున్నాయి? ఈ ఘటనపై ఎన్డీఎస్‌ఏ లేదా ఇతర స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని కేటీఆర్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply