Co-operative | రాష్ట్ర ఉత్తమ సొసైటీ అవార్డు…

Co-operative | రాష్ట్ర ఉత్తమ సొసైటీ అవార్డు…
Co-operative | జన్నారం, ఆంధ్రప్రభ : 72వ ఆలిండియా కో-ఆపరేటివ్(Co-operative) సహకార వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ సింగల్ విండో సొసైటీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సోసైటీగా ఎంపికైంది.
ఈ మేరకు తెలంగాణ సహకార సంఘం రాష్ట్ర ప్రిన్సిపాల్ భూక్య వెంకన్న(Bhukya Venkanna), ఎండీ అన్నపూర్ణ, డీసీఓ సంజీవరెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రశంసా పత్రాన్ని ఆ సొసైటీ చైర్మన్ అల్లం రవికి, కార్యదర్శి కావేటి రాజన్నకు హైదరాబాదులో ఈ రోజు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ రవి మాట్లాడుతూ.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్(MLA Vedma Bojju Patel) సహకారంతో సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఈ సందర్భంగా వారిని సొసైటీ పాలకవర్గ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
