“సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి”… ఏపీ జేఏసీ నాయకుల నిరసన.

ఏలూరు, ఆంధ్రప్రభ: ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బుధవారం జిల్లా లోని ఉద్యోగులు అందరు కూడా నల్ల బ్యాడ్జీ లు పెట్టుకొని విధులకు హాజరై ప్రతి ఒక్కరు వారి యొక్క వాట్సాప్ డీపీ (ప్రొఫైల్ ఫోటో) లో “సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి” అని నిరసన తెలియజేయడము ఉద్యోగ నాయకులు “హ్యాండ్ టు హ్యాండ్” కార్యక్రమములో భాగముగా అన్నీ ప్రభుత్వ కార్యాలయములను సందర్శించి కరపత్రాలను పంపిణీ చేసి, ఎందుకు ఉద్యమము చేయవలసి వచ్చిందో సవివరముగా తెలియజేసి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకు రావలసిన న్యాయమైన డిమాండ్లు పెండింగ్‌లో వున్న 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం, మధ్యంతర భృతి (ఐ.ఆర్) విడుదల, పెండింగ్ 5 డి.ఏ లు విడుదల తదితర డిమాండ్లు అన్ని పరిష్కరించాలని ఏపీ జెఎసి అమరావతి ఏలూరు జిల్లా చైర్మెన్ కె. రమేష్ కుమార్ ప్రకటనలో తెలియజేసారు.

ఈ కార్యక్రమములో రెవెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎ.ప్రమోద్ కుమార్, జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, మహిళా విభాగము చైర్ పర్సన్ గీతిక, మహిళా విభాగము వైస్ చైర్మన్ శాంత కుమారి, రెవెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల జిల్లా అధ్యక్షులు, క్లాసు -4, పెన్షనర్స్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ సంఘముల నాయకులు పాల్గొన్నారు.