సీఎం రేవంత్ అహర్నిశలు కృషి

చేవెళ్ల, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ ) : పేదల సంక్షేమం, అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అహర్నిశలు కృషి చేస్తున్నారని చేవెళ్ల శాసన సభ్యులు కాల యాదయ్య వెల్లడించారు. బుధవారం చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు 74 లక్షల 8వెల 54 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతున్నదన్నారు. ఇందిరమ్మ ఇల్లు, గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రేషన్ లబ్ది దారులకు సన్న బియ్యం పంపిణీ తదితర పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికి గెలిపించాలని ఆయన కోరారు.

తద్వారా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ. మధుసూదన్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, తహశీల్దార్ కృష్ణయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎస్. బల్వంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, సర్పంచులు మధుసూదన్ గుప్తా, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, పాండు, పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply