TG | రేపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ !

హైద‌రాబాద్ – కులగణన, ఎస్సీ వర్గకరణ అంశాలతో పాటు ప్రభుత్వం పథకాల అమలు, ఇతర సమస్యలపై చర్చిందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం కొనసాగనుంది.

ఈ స‌మావేశంలో ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొన‌నున్నారు.. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల కొంద‌రు ఎమ్మెల్యేలు నిర్వ‌హించిన స‌మావేశంపై కూడా ఆయా ఎమ్మెల్యేల నుంచి ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ వివ‌రాలు సేక‌రించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *