CM Revanth | జ్ఞానార్జన కోసం గ్రంథాలయాలకు…

CM Revanth | జ్ఞానార్జన కోసం గ్రంథాలయాలకు…
library | రేగొండ, ఆంధ్రప్రభ : కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర పఠన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రంథాలయాల నిర్మాణానికి పునాది వేసిన మహోన్నతులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకుంటూ, నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు గ్రంథాలయాల మహోత్సవాల ద్వారా భావితరాలకు తెలియజేసే కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం(Praja Government) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి సామాజిక మాధ్యమాల యుగంలో పిల్లలు, యువత గ్రంథాలయాల వైపు మళ్లాల్సిన అవసరం మరింత పెరిగిందన్నారు.
గ్రంథాలయం(library) అనేది నాలుగు గోడల మధ్య పుస్తకాల సమాహారం(collection of books) మాత్రమే కాకుండా జ్ఞాననిధి అని, ప్రతి ఒక్కరూ జ్ఞానార్జన కోసం గ్రంథాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రంథాలయాల ద్వారా అనేక గొప్ప వ్యక్తులు తమ భావజాలం, విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారని, అలాంటి స్థలాలను పునరుజ్జీవింపజేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యాభివృద్ధి కోసం గ్రంథాలయాలు కీలక కేంద్రాలని పేర్కొన్నారు. చదువుకు, పోటీ పరీక్షలకు(competitive exams) సిద్ధమవుతున్న యువతకు, అలాగే పుస్తకాభిమానులకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజలు ఈ గ్రంథాలయాన్ని విస్తృతంగా వినియోగించుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే(MLA) ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, నాయకులు సూరం వీరేందర్, మాటిక సంతోష్, సుధానబోయిన ఓం ప్రకాష్, తోకల సురేందర్ రెడ్డి, చిగురుమామిడి కుమారస్వామి, ముడుతనపల్లి శంకర్, కాశెట్టి రాజయ్య బొమ్మకంటి రవి, పాతపల్లి సంతోష్, పొనుగోటి వీరబ్రహ్మం, నడిపెల్లి వెంకట్రావు, లెంకలపెల్లి రవి, కానుగుల తిరుపతి, అమ్ముల సదయ్య, ఒడ్డల రాజు, బోయిని కుమారస్వామి, పత్తి తిరుపతి, జోరు సుదర్శన్, బండారి దేవేందర్, మైస భిక్షపతి,నాగపూరి శ్రీధర్, వావిలాల రమేష్, వైనాల ప్రభాకర్, కనకం రమేష్, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
