ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సీఎం సహాయనిధి మంజూరు
భవానిపురం, ఆంధ్రప్రభ: భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.12 లక్షల విలువైన ఎల్‌ఓసీని లబ్ధిదారుకు అందజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
39వ డివిజన్, నాలుగు స్తంభాల సెంటర్‌కు చెందిన చుండూరు శారదకుమారి (75) గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.12 లక్షల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేశారు.
ఎన్డీయే కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత వీవీకే నరసింహారావు, మాజీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, బుల్లా విజయ్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతల సమక్షంలో ఎల్‌ఓసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సుజనా న్యాయమిత్ర బాయన హేరంబకుమార్, జనసేన నాయకుడు ఏలూరి సాయి శరత్, బీజేపీ కుమ్మరిపాలెం మండల అధ్యక్షుడు వెలమూరి అయ్యప్ప, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
