Delhi | రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు !

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా 15వ తేదీన ఆయ‌న‌ హస్తినకు బ‌య‌ల్దుర‌నున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో సమావేశాలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ముఖ్య అంశాలు:
• కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీలు.
• పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులపై చర్చ.
• గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, కేంద్ర నిధుల విడుదలపై చర్చ.
• ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ, నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశం.
• మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సభలో ప్రసంగం.
• భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం.

కాగా, ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నాడు. జూలై 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి 17వ తేదీ ఉదయం రాష్ట్రానికి తిరిగి వస్తాడు.

Leave a Reply