Cm-Cbn-Emotional-at-Veligonda : ఉత్పాహం..ఉద్వేగం Andhra Prabha Top News
Cm-Cbn-Emotional-at-Veligonda : ఉత్పాహం..ఉద్వేగం Andhra Prabha Top News
- వెలిగండలో సీఎం విజయావేశం
- ప్రణమల్లి కృష్ణమ్మకు స్వాగతం
- హారతి పట్టి ప్రత్యేక పూజలు
- కండువ తిప్పుతూ ర్యాంప్ వాక్
- 30 ఏళ్ల కల నెరవేరిన వేళ.. సీఎం సీబీఎన్ అమితానందం
(ఆంధ్రప్రభ, మార్కాపురం ప్రతినిధి)

ఉత్సాహం.. ఉద్వేగం గా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. పండుగలా.. ఏడుకలా సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పంచెకట్టులో వెళ్లి కృష్ణమ్మకు స్వాగతం పలికారు.కృష్ణా జలాల్లో దిగి కృష్ణమ్మకు పూజలు చేసి, హారతి ఇచ్చారు , కృష్ణమ్మ పవిత్ర జలాలను నేతలు, అధికారులపై చల్లి సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

పీడర్ కాలువ దగ్గర కృష్ణమ్మ ప్రవాహానికి సిఎం సాష్టాంగ నమస్కారం చేశారు. స్థానికులు, రైతులు, నిర్వాసితులతో కలిసి స్విచ్ నొక్కి గేట్లు ఎత్తారు, సాంప్రదాయ నృత్యాలతో కృష్ణమ్మకు గిరిజన బిడ్డలు స్వాగతం పలికారు. వేదిక ర్యాంప్ పై కలియతిరిగి రైతులు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు సిఎంకండువాను గాల్లో తిప్పుతూ రైతుల సంతోషంలో భాగం పంచుకున్నారు.

పూలసుబ్బయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఆత్మీయ పలకరించి, సన్మానం చేశారు. ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులను స్వయంగా పిలిచి శిలాఫలకం వద్ద ఫోటోలు దిగారు. .ఇరిగేషన్ మంత్రి రామానాయుడుకు ప్రత్యేక అభినందన తెలిపారు.
