జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లో కురిసిన కుండపోత వర్షాలు ప్రజలను కుదిపేశాయి. రియాసి జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలవ్వగా, రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లోని రియాసి జిల్లా మహోర్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడి నివాస భవనం నేలమట్టం కావడంతో అందులోని వారు చనిపోయారు. మృతులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మరోవైపు రాంబన్ (Ramban) జిల్లా రాజ్‌గఢ్‌లో క్లౌడ్‌ బరస్ట్ (Cloud burst) సంభవించింది. వరదల ధాటికి ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సహాయక బృందాలు సంఘటనాస్థలికి చేరుకొని చర్యలు చేపట్టాయి.

Leave a Reply