Sunday, November 24, 2024

భారీగా పెరుగుతున్న జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షేర్స్..

సోనీ నెట్‌వ‌ర్క్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ విలీనం కానుండ‌టంతో ఈ సంస్థ షేర్ల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ ( ZEEL ) షేర్లు వ‌రుస‌గా రెండో రోజు కూడా దూసుకెళ్తున్నాయి. గురువారం ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాత బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో జీ షేరు ధ‌ర రూ.339.70గా ఉంది. అటు ఎన్ఎస్ఈలోనూ షేరు ధ‌ర రూ.339.70గా ఉండ‌టం విశేషం. విలీనం త‌ర్వాత జీలో సోనీ భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నుంది.

దీంతో ఈ వార్త వెలువ‌డిన బుధ‌వార‌మే జీ షేరు ధర ఏకంగా 32 శాతం పెరిగి రూ.337.10కు చేరింది. ఒక ద‌శ‌లో 39 శాతం పెరిగి 52 వారాల గ‌రిష్ఠం రూ.355.40ను తాకింది. అటు ఎన్ఎస్ఈలోనూ బుధ‌వారం జీ షేరు ధ‌ర 30.5 శాతం పెరిగి రూ.333.70కు చేరింది. బీఎస్ఈలో జీ మార్కెట్ విలువ కూడా రూ.7,823 కోట్ల నుంచి రూ.32,378 కోట్ల‌కు చేర‌డం విశేషం.

ఇది కూడా చదవండి: MAA Elections: మంచు విష్ణు ప్యానల్ ఇదే..

Advertisement

తాజా వార్తలు

Advertisement