యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో తనను అసభ్యకరంగా తాకినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ బెహర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.
- Advertisement -