యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు గానే తెరకెక్కబోతున్నాయి.
అయితే ఈ సినిమాల తర్వాత ఏ సినిమా ఎన్టీఆర్ చేయబోతున్నాడు అనే దానిపై ఇంకా సరైన క్లారిటీ రాలేదు. నిజానికి ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ల కోసం చూస్తున్నారట. సరైన బాలీవుడ్ డైరెక్టర్ దొరికితే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారట. మరి ఎన్టీఆర్ అనుకున్నట్టు ఎవరైనా బాలీవుడ్ డైరెక్టర్ వస్తారా లేక మళ్లీ టాలీవుడ్ డైరెక్టర్ తోనే సరిపెట్టుకుంటాడా అనేది చూడాలి.