Friday, November 22, 2024

మీ ఇద్ద‌రిదీ అంద‌మైన జంట‌.. ట్వీట్ చేసిన చిరంజీవి

న‌టుడు..నిర్మాత నాగ‌బాబు కుమారుడు..హీరో వ‌రుణ్ తేజ్..హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. దాంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరై కాబోయే జీవిత భాగస్వాములను ఆశీర్వదించారు. మరోవైపు వ‌రుణ్ తేజ్ పెదనాన్న..మెగాస్టార్ చిరంజీవి, పెద్దమ్మ సురేఖల సమక్షంలో లావణ్యకు వరుణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు. కాగా వరుణ్, లావణ్య జంటకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘వరుణ్ తేజ్, లావణ్యలకు ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు. మీ ఇద్దరిదీ ఒక అందమైన జంట. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా ఉండాలి. మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాల‌ని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement