Tuesday, November 26, 2024

ప్ర‌పంచంలోనే బెస్ట్ ఫాద‌ర్ మీరే నాన్న‌.. అల్లు అర్జున్

ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్ మీరే నాన్న అని త‌న తండ్రి అల్లు అర‌వింద్ కి ఫాద‌ర్స్ డే విషెష్ చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జూన్ 18న ఫాదర్స్ డే కావడంతో ఎమోషనల్ పోస్ట్ చేశారు బ‌న్నీ. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ నోట్ రాశారు. ‘ప్రపంచంలో ఉన్న తండ్రులు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్ అయిన మీకూ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రత్యేకమైన రోజున తండ్రిపై అల్లు అర్జున్ చూపించిన ప్రేమకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement