Tuesday, November 26, 2024

నీవంటే నాకు ప్రేమ‌..గౌర‌వం.. ర‌ష్మిక‌

పుష్ప చిత్రంలో హీరోయిన్ ర‌ష్మిక చేసిన శ్రీవ‌ల్లి పాత్రపై మ‌రో హీరోయిన్ ఐశ్వ‌ర్య‌రాజేశ్ త‌నఅభిప్రాయాలను వెల్లడించగా, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆమె వివరణ ఇచ్చింది. వాస్తవంగా తానేమి మాట్లాడానన్న వివరణతో ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ పాత్రలో రష్మిక కంటే తాను ఏ విధంగానూ మెరుగ్గా ఉండనని ఐశ్వర్య రాజేష్ స్పష్టం చేసింది. కాకపోతే అలాంటి పాత్ర తనకు నప్పుతుందని చెప్పానంటూ స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టు పేర్కొంది. రష్మిక పాత్ర పట్ల తనకు ఎంతో అభిమానం తప్పించి మరోటి లేదన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ‘తెలుగు సినిమాలో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు అని నన్ను ప్రశ్నించారు. తెలుగు పరిశ్రమ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పా. నాకు నచ్చే పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానన్నాను. పుష్ప సినిమాలో శ్రీవల్లి తరహా పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని ఉదాహరణగా చెప్పాను. కానీ నా మాటలను వక్రీకరించి వేరే అర్థం వచ్చేలా రాశారు. సదరు సినిమాలో రష్మిక చేసిన అద్భుతమైన నటనను నేనేదో కించపరిచినట్టు చూపించారు’’ అంటూ ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది.రష్మిక మందన్న స్పందిస్తూ.. ‘‘హాయ్ లవ్.. నీవు ఏం చెప్పావో నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. మనకు మనం వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు. నీవంటే నాకు ప్రేమ, గౌర‌వం ఉన్నాయనేది నీకు తెలుసని ట్వీట్ చేసింది ర‌ష్మిక‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement