గతేడాది కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లు సైతం నిలిచిపోయాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. సినిమా థియేటర్లు కూడా రీ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా మెల్ల మెల్లగా అలవాటు అవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాగా పెద్ద సినిమాలు మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు.
వకీల్ సాబ్ మాత్రం రేపు రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం కష్టమే అని చెప్పవచ్చు.
ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత ఆచార్య ,బాలయ్య బిబి 3, కే జి ఎఫ్ 2, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కానీ ఓ వైపు ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. వకీల్ సాబ్ మాత్రం అనుకున్న సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేస్తుంది. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి మాత్రం అర్థం కావట్లేదు. దీంతో దర్శక నిర్మాతలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.