Saturday, November 23, 2024

బిగ్ బాస్ సీజన్ 5 మళ్లీ ఆలస్యం అవుతుందా ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగు సీజన్ లు పూర్తిచేసుకొని ఐదవ సీజన్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఏడాది కూడా ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా మొదటిసారి కరోనా వచ్చినప్పుడు.. లాక్ డౌన్ పెట్టారు. దీంతో కొన్ని నెలలు పాటు బిగ్ బాస్ సీజన్ 4 వాయిదాపడింది. అంతేకాకుండా కంటెస్టెంట్ లను మూడు వారాల పాటు క్వారంటైన్ చేసి ప్రారంభించారు.

నిజానికి ఈ ఏడాది జూన్ నెలాఖరు నుంచి బిగ్ బాస్ మొదలు పెట్టాలని భావించారు. ఇప్పటికే పోటీదారులకు సంబంధించిన లిస్ట్ కూడా రెడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా బిగ్ బాస్ షో ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దీనితో సెప్టెంబర్ లో ఆరంభించి డిసెంబర్ కి ముగించాలని షో నిర్వాహకులు అనుకుంటున్నారట. కాగా ఈ ఏడాది కూడా బిగ్ బాస్5 కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement