అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి..రాజకీయాల్లోకి రావడమే తన లక్ష్యం అంటోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్.రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకొని రోజు ఒక్కరి మొహమే చూస్తూ ఉండాలా? ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలన్నదే నా లక్ష్యం.. ఇక ప్రేమలేని పెళ్లిలో అర్థం లేదు.. ప్రేమించకుండా పెళ్లి చేసుకోలేను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇకపోతే వరలక్ష్మి సమాధానానికి షాక్ అయిన యాంకర్.. పెళ్లిపై చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు కదా అని అడగ్గా.. ఎవరి బలవంతం మీద ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండలేం.
ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తితో ఉండాలి అని నిర్ణయించుకుంటేనే.. తప్పకుండా పెళ్లి చేసుకోవాలి.. సల్మాన్ ఖాన్ లాంటి హీరోలను ఎందుకు పెళ్లెప్పుడు అని అడగరు.. ఆడవాళ్ళని ఎందుకు ఇలా ఇన్ని ప్రశ్నలు వేసి హింసిస్తారు అంటూ ప్రశ్నించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆడవాళ్లు సొంతంగా వారు బ్రతకగలరు. వారి కోసం బ్రతకగలరు.. వారి కోసం సంపాదించుకోగలరు.. ఖర్చు పెట్టగలరు.. ఎవరిపైన ఆధారపడి బ్రతకాల్సిన అవసరం వారికి లేదు.. నేను ప్రేమలో పడడం.. అతడితోనే బతకాలని అనుకోవడం..అది జరగకుండా పోవడం వంటివన్నీ అయిపోయాయి అంటూ ఆమె బాధపడింది. మొత్తానికైతే త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది.