Monday, November 25, 2024

ఇండస్ట్రీలో పవన్ ఒంటరివాడా ? – లేదా ఒంటరి చేశారా ?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏమైంది?

పవన్ కళ్యాణ్ ఎందుకు ఒంటరివాడు అయ్యాడు ?

ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమా టికెట్స్ ధరలపై ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదు ?

మొత్తం వ్యవహారం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్స్ రేట్ల పెంపుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు డివిజన్ బెంచ్ సవరించింది. టికెట్ ధరలు కేవలం శనివారం వరకే అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఆదివారం నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధరలు ఉంటాయని డివిజన్ బెంచ్ చెప్పుకొచ్చింది. ఇక ఆన్లైన్లో బుక్ అయిన టికెట్ల విషయంలో ఆదివారం షో ల వరకు హైకోర్టు వెసులుబాటును కల్పించింది. కాగా అంతకు ముందు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.అయితే అప్పుడు వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రిలీస్ మూడు రోజుల పాటు టికెట్ రేట్ పెంచుకోవచ్చు అంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. 13 జిల్లాల కలెక్టర్లకు అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం హౌస్ లో పిటిషన్ వేసింది.

ఇదిలా ఉండగా వకీల్ సాబ్ సినిమాపై మొత్తం రాజకీయ మబ్బులు అలముకున్నాయి. మామూలుగా కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు, ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. అన్ని చిత్రాల ప్రకారమే వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షో ధరల పెంపునకు అనుమతి ఉంటుందని అందరూ భావించారు. కానీ రాత్రికి రాత్రే బెనిఫిట్ షోలు వేయకూడదని టికెట్ల ధరలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అధిక ధరలకు టికెట్లు అమ్మిన బెనిఫిట్ షోలు వేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మెగా అభిమానులు ప్రభుత్వంపై మండిపడ్డారు.

- Advertisement -

ఇదంతా ఇలా ఉండగా ఏపీ వ్యాప్తంగా ఈ వ్యవహారంపై రచ్చరచ్చ జరుగుతుంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం విశేషం. ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా లో వీడియోలను పెట్టే నాగబాబు కూడా ఎక్కడా కనిపించలేదు. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ వైసిపి నాయకులు సైతం విమర్శిస్తున్నా పట్టించుకోవట్లేదు. అంతేకాదు మరోవైపు టాలీవుడ్ పెద్దగా పెద్దమనిషిగా చలామణి అవుతున్న చిరంజీవి సైతం నోరు మెదపలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది. ఇక సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ మళ్లీ సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం మాకెందుకులే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు .మరోవైపు ఇటీవల జగన్ థియేటర్లకు రాయితీలు కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. జగన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇటువంటి సమయంలో మరి ఆచార్య టికెట్ ధరలు పెంచుతా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పవన్ విషయాన్ని ఎందుకు పెద్దలు గాలికి వదిలేశారు అర్థం కావట్లేదు. ఏదేమైనా ఇండస్ట్రీ మొత్తం ఒక అడుగు ముందుకు వేయవలసిన సమయం లో కూడా మౌనం దాలుస్తు పవన్ ని ఒంటరివాడిని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement