Thursday, November 14, 2024

జైలు కు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరు ? మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు !!

మా అసోసియేషన్ ఎన్నికలలో ఈసారి పోటీకి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ నటి హేమ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఈ రచ్చ మొదలైంది. అలాగే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. కాగా ఇటీవలే మంచు విష్ణు మాట్లాడుతూ….పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని లేదంటే కచ్చితంగా పోటీ చేస్తానని… అలాగే తన సొంత నిధులతో మా భవనం కట్టిస్తానని తెలిపారు.

అయితే అయితే తాజాగా మరోసారి మా ఎన్నికలపై విష్ణు స్పందించారు. మా ఎన్నికల గురించి మాట్లాడటం అందరూ ఆపేయాలని ఇక్కడ ఏదో బీభత్సం జరిగిపోతుందని అందరూ అనుకుంటున్నారని అన్నారు. అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా మా భవనాన్ని కడతానని దానికి బాలయ్య కూడా సహాయం చేస్తానని చెప్పారని చెప్పుకొచ్చాడు. కరోనా కష్టకాలంలో సహాయం చేసి దానిని కూడా టాంటాం చేస్తున్నారని అలా సహాయం చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారని… ప్రచారం చేస్తే ఇంకొందరికి స్ఫూర్తి కలుగుతుందని వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో జైలు కి వెళ్లాల్సిన కొంతమందిని ఎవరు కాపాడారో వాళ్ళని అడిగితే తెలుస్తుందని హెచ్చరించారు. హద్దు మీరి మాట్లాడితే వారి పేర్లు కూడా బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా ఇప్పుడు ఆ జైలు కి వెళ్లాల్సిన వారు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement