Tuesday, November 26, 2024

కరోనా తగ్గింది…కానీ పవన్ బయటకు రావటం కష్టమే !!

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు పాజిటివ్ నిర్ధారణ కావడంతో క్వారంటైన్ లో ఉంటూ చికిత్స కూడా తీసుకున్నారు. వ్యక్తిగత వైద్యులు, అపోలో వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించి పవన్ కు వైద్యం అందించారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు నెగిటివ్ కూడా వచ్చింది.

అయితే ప్రస్తుతానికి పవన్ ఇంకా బలహీనంగానే ఉన్నారట. హైదరాబాద్ శివారు లో ఉన్న తన ఫామ్ హౌస్ లో ప్రస్తుతం పవన్ ఉన్నారు. మునుపటిలా యాక్టివ్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుందట. పైగా బయట పరిస్థితులు కూడా బాగోకపోవడం తో మరి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement