Tuesday, November 26, 2024

అనుపమ ఏంటి ఇలాంటి ఫోటోలు షేర్ చేసింది?

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమమ్, అఆ, శతమానంభవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ అమ్మడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా మహిళల శరీరాకృతి ఆడవారి మీద జరిగే వివక్ష గురించి ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మహిళలు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా ఇలా ఎలా ఉన్నా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. మహిళలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతూ ఉంటారు. లావుగా ఉంది, జీరో సైజులో లేదు సరిగా లేదు అంటూ విమర్శిస్తూ ఉంటారు. కొందరు తినండి అని మరికొందరు తినకండి అని సలహాలిస్తుంటారని అనుపమ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే అనుపమ ఇలాంటి పోస్టులు పెట్టడం అందరికీ ఇప్పుడు షాక్ కి గురి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement