దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కొడుకులు… ప్రభు, అరుణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోమశేఖర్ అనే వ్యక్తి తాజాగా కేసు వారి పై కేసు పెట్టాడు. పూర్తి వివరాల్లోకి గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటాడు. దాసరితో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉండేది.
అయితే దాసరి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు సోమశేఖర్ రూ.2.10 కోట్లు అప్పుగా ఇచ్చాడు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో దాసరి మృతి చెందారు. 2018 నవంబర్ 13న పెద్దల సమక్షంలో ఆయన కుమారులు ప్రభు, అరుణ్ రూ.2.10 కోట్లకు బదులు రూ.1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఆ డబ్బును వారు ఇవ్వడం లేదని జూబ్లీహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు సోమశేఖర్. ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 46లోని దాసరి నివాసానికి వెళ్లానని.. ప్రభు, అరుణ్ ను డబ్బు చెల్లించాలని అడిగితే ర్యాష్ గా బిహేవ్ చేశారని చెప్పాడు. ఇంకోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు హెచ్చరించినట్లు పోలీసులకు చెప్పుకొచ్చారు.