Friday, November 22, 2024

Dear : వెడ్డింగ్‌ పాట… 

ఐశ్వర్య రాజేష్‌, జీవీ.ప్రకాష్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్‌ నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఒక రోజు తేడాతో ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తారు.

తాజాగా డియర్‌ సినిమా నుంచి ”భలే వెడ్డింగ్‌… ” పాటను విడుదల చేశారు. హీరోగా నటిస్తూ సంగీతం కూడా అందించారు జీవీ.ప్రకాష్‌కుమార్‌. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని నారాయణన్‌, రవిశంకర్‌, సిందూరి విశాల్‌ ఆలపించారు. హీరో హీరోయిన్లపై పాటని చిత్రీకరించారు. ఈ సినిమా ఆంధ్ర హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్‌, తెలంగాణ హక్కులను ఏషియన్‌ సినిమాస్‌ సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement