Tuesday, December 10, 2024

Sandhya Theater Stampede | వారి కుటుంబానికి మేమున్నాం : అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున పుష్ప-2 ప్రీమియ‌ర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు.

మృతురాలు రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ‘‘సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నా హృదయాన్ని కలిచివేసింది. ఈ విషాద సమయంలో రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మేము ఏం చేసినా మీరు లేని లోటును పూడ్చ‌లేము. ఆ కుటుంబం ఒంటరి కాదు.. ఈ బాధాకర సమయంలో నేను వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తాను. వారికి అన్ని రకాలుగా సాయం చేస్తాను” అని అల్లు అర్జున్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement