Monday, November 18, 2024

RRR | ఒరిజనల్‌ లో ఆ పాత్రను చంపేశాం.. : రాజమౌళి !

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. రామ్‌చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్.. జెన్నీ పాత్రలో కనిపించింది. అయితే ఆమె పాత్రపై రాజమౌళి ఆసక్తిని బయటపెట్టారు.

జెన్నీ పాత్ర మొదట విషాదకరమైన ముగింపుతో రాశామని, భీమ్ రామ్ జైలు నుండి విడుదలైన తర్వాత, జెన్నీ భీమ్‌కు సహాయం చేస్తున్న నేపథ్యంలో ఆమె పాత్ర చనిపోతుందని రాజమౌళి చెప్పారు. అయితే ఈ జెన్నీ చనిపోతే సినిమా ముగింపు ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే జెన్నీ క్యారెక్టర్ ని బతికున్నట్లుగా మార్చి రాశామని.. అది అందరికీ నచ్చిందని.. జెన్నీ క్యారెక్టర్ డిజైన్ గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement