Tuesday, November 26, 2024

Vyuham – ఘనంగా ఆర్జీవీ బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా “వ్యూహం” ‘జగ గర్జన’ ఈవెంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా “వ్యూహం”. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ఈవెంట్ విజయవాడలో చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గురించిన నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తుండటం సంతోషకరం. . వ్యూహం లాంటి సినిమాలు వర్మ గారు మరిన్ని తీయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకునేందుకు కొందరు కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహం రిలీజ్ ను ఆపలేరు. ఈ సినిమాతో ప్రజలకు నిజాలు తెలియాలి. అన్నారు

ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే కొందరు భయపడి కోర్టులకు వెళ్తున్నారంటేనే ఈ సినిమా ఎంతటి విజయం సాధించబోతోంది అనేది అర్థం చేసుకోవచ్చు. అన్నారు.

వైసీపీ సమన్వయకర్త ఫాతిమా మాట్లాడుతూ – ఈ సినిమాలో జగన్ ని చూపించిన విధానం బాగుంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నార‌ని అన్నారు.

- Advertisement -

తెలుగు సేన అధ్యక్షుడు సత్యా రెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్ గారి అభిమానులకు సంతోషాన్ని పంచుతుందని ఆశిస్తున్నా అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన మాట్లాడుతూ – వ్యూహం సినిమాకు పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంద‌ని చెప్పింది.

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – వర్మను భయపెట్టాలని చూశారు. ఆయన ముంబై మాఫియాకే భయపడలేదు వీళ్లకు భయపడతాడా. వ్యూహం సినిమా పెద్ద హిట్ కావాలి. అన్నారు.

మంత్రి రోజా మాట్లాడుతూ – గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లా.. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు వ్యూహం సినిమాతో ఈ తరంతో పాటు వచ్చే తరానికీ తెలుస్తాయి. అని చెప్పారు.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ – జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయనను ఓడించాలని చూసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు. అన్నారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ – ఈ సినిమా రిలీజ్ ను ఎవరూ ఆపలేరు. ప్రజలు వ్యూహంను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు

ఎమ్మెల్యే శివ కుమార్ మాట్లాడుతూ – ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నా. అన్నారు.

క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ – . వ్యూహంతో జగన్ మీద చేసిన దుష్ప్రచారాల వెనక దాగి ఉన్న నిజాలు తెలుస్తాయి. అన్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశాను. కానీ వ్యూహం సినిమా నేపథ్యం ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదే. ఇందులో కథ కంటే క్యారెక్టర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నేను వైసీపీ మనిషిని అంటున్నారు. నేనే చెబుతున్నా కదా జగన్ కు ఫేవర్ గానే వ్యూహం సినిమా ఉంటుంది. డెఫనెట్ గా ఈ నెల 29న వ్యూహం సినిమా రిలీజ్ చేస్తాం. అన్నారు.

నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – వర్మ వ్యూహం సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తప్పకుండా వ్యూహం సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement