Saturday, November 23, 2024

ల‌క్ష్యం,లౌక్యం బాట‌లోనే రామ‌బాణం..

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం రామబాణం. శ్రీవాస్‌ దర్శకుడు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు లౌక్యం, లక్ష్యం చిత్రాలు వచ్చాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీ-జీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన నాయికగా డింపుల్‌ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రధా రులు. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో థియేటర్ల లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత టీ-జీ విశ్వప్రసాద్‌ పలు ఆసక్తికర విష యాలను పంచుకున్నారు.

పీపుల్‌ మీడియా సినిమా అంటే ఒ క బ్రాండ్‌. ఈ సినిమాపై మీకు ఎలాం టి అంచనాలు ఉన్నాయి?
బ్రాండ్‌ కంటే కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. రామబాణం అలాగే తీశాం. శ్రీవాస్‌ గారు ఈ కథ చె ప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుంది అనిపించింది.
గోపీచంద్‌-శ్రీవాస్‌ కలయికలో వస్తున్న మూడవ సినిమా కదా.. ఎలాంటి కృషి చేశారు?.
ప్రొడక్షన్‌ వైపు మేం చేయాల్సింది చేశాం. పూర్తి సహకారం అందించాం. సినిమా బ్రదర్‌ సెంటిమెంట్‌ మీద రన్‌ అవుతుంది ఈ సినిమా. లక్ష్యం, లౌక్యం సినిమాల తరహాలోనే యాక్షన్‌ తో పాటు- ఫ్యామిలీ సెంటిమెంట్‌ కూడా ఉంటు-ంది.
ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?.
ప్రొడక్షన్‌ని ఫ్యాక్టరీ తరహాలో ప్రారంభించాం. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి చాలా తెలుసుకున్నాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒక టి, రెండు సినిమాలు కాకుండా.. ఒకేసారి ఎక్కువ సినిమాలు తీ స్తూ, ఒకటి కాకపోతే మరొకటి విజయం సాధిస్తుందనే నమ్మ కంతో ముందుకు వెళ్తున్నాం. మాకు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలోకి కేవలం వ్యాపారం కోణంలో కాకుండా, సినిమా మీద ఉన్న ఆసక్తితో అడుగుపెట్టాం.
రామబాణం -టైటిల్‌ బాలకృష్ణ సూచిం చారని పెట్టారా?
ఈ సినిమా కోసం కొన్ని -టైటిల్స్‌ ని పరిశీలించాము. బాలకృష్ణ గారు రామ బాణం -టైటిల్‌ సూచించారు. ఇది అన్న దమ్ముల కథ కావడంతో, -టైటిల్‌ సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతో దాన్నే ఖరా రు చేశాము.
మీ సినిమాల ఎంపిక ఎలా జరుగు తుంది?
సినిమాల ఎంపికకు అంటూ ప్రత్యేకంగా ఒక ఫార్ములా లేదు. కాన్సె ప్ట్‌ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుం డా అన్ని రకాల సినిమాలు చేసుకుం టూ వెళ్తున్నాము.
వెన్నెల కిషోర్‌ హోస్ట్‌ గా ‘అలా మొదలైంది’ అనే షోతో టీ-వీ రంగంలోకి అడుగు పెట్టడం ఎలా ఉంది?
నిజానికి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రారంభంలోనే టీ-వీ రంగంలోకి అడుగుపెట్టాం. ఈటీ-వీలో మూడు సంవత్సరాల పాటు- ‘పాడుతా తీయగా’ కార్యక్రమం చేశాము. అప్పటి నుంచే టీ-వీ షోలపై ఆసక్తి ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం.
సినిమాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
సినిమానే నాకు స్ఫూర్తి అండి. మా ప్రత్యేకతను చాటు-కోవడానికి ముందునుంచే పక్కా ప్రణాళికతో అడుగు పెట్టాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement