Monday, October 21, 2024

VS13 | కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించిన విశ్వక్ సేన్..

మాస్ కాదాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే తాజాగా #VS13 ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ‘దసరా’తో భారీ బ్లాక్‌బస్టర్‌ని అందించిన ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా, ఈ మూవీకి నూతన దర్శకుడు శ్రీధర్ గంటా రాసి దర్శకత్వం వహించ‌నుంద‌డ‌గా… ‘కాంతారావు’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా, విశ్వక్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫైర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని.. విశ్వక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. దీంతో పాటు ‘లైలా’ అనే కొత్త సినిమాను కూడా విశ్వక్ ప్రకటించాడు. రామ్‌నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement