మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంపై డీసెంట్ బజ్ ఉండగా ఈ సినిమాను డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ రిలీజ్ విషయంలో తాను లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది.
మనకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒకడు మన గేమ్ మారుద్దామనే చూస్తాడు. ఒకవేళ ఈ సినిమా కానీ డిసెంబర్ 8న రిలీజ్ అవ్వలేదు అంటే మరో డేట్ కి కానీ మారితే ఇక నన్ను ఈ సినిమా ప్రమోషన్స్ లో చూడరు అని షాకింగ్ రియాక్షన్ అందించాడు. దీనితో తనకి నిర్మాతలకు సినిమా రిలీజ్ విషయంలో తనకి ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.