తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఓ మై కడవులే. ఈ మూవీని “ఓరి దేవుడా” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అశ్వత్ మరిముత్తు దర్శకుత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా కనిపించనున్నాడు. మిథాలీ పార్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమాలో దేవుడి పాత్ర కీలకం. తమిళంలో ఆ రోల్ ని విజయ్ సేతుపతి చేశాడు. తెలుగులో ఈ క్యారెక్టర్ ఓ టాప్ హీరోతో చేయించాలని గత కొన్నాళ్లుగా మూవీ టామ్ ప్రయత్నిస్తోంది. కాగా, ఎట్టకేలకు ఈ సినిమాకి దేవుడు దొరికేశాడు. ఆ పాత్ర చేయడానికి వెంకటేష్ ఒప్పుకొన్నారు.
ఆయన ఈ సినిమాకి ఇచ్చింది నాలుగైదు రోజుల కాల్షీట్లే. తమిళంలో విజయ్‌సేతుపతి మీద కేవలం 3 రోజుల్లో ఆయా సన్నివేశాల్ని తెరకెక్కించారు. దాంతో పోలిస్తే.. వెంకీ కాస్త ఎక్కువ కాల్షీట్లు ఇచ్చినట్టే లెక్క. వెంకీ ఆగమనంతో “ఓరి దేవుడా” లుక్ పూర్తిగా మారిపోనుంది. వెంకటేష్ పార్ట్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. వెంకీ మామా పార్ట్ కూడా అయిపోతే, సినిమా సిద్ధమైపోయినట్టే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.