సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టి కల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథా నాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ స్క్రన్ ప్లే అం దించారు. ఏప్రిల్ 21న విడుదలై విజయాన్ని సాధిం చింది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో… సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ”’విరూపాక్ష’ సినిమా సక్సెస్ నాదో, మా టీమ్‌దో కా దు. మన ప్రేక్షకులది. గత ఏడాది కొన్ని సినిమాలకు జనాలు రాలేదు. ఎందుకంటే వాళ్లు మాకు చాలెంజ్ విసిరారు. మేం థియేటర్స్‌కు రావాలంటే అలాంటి సినిమాలు మీరు చేయండని చెప్పారు. ఆ చాలెంజ్‌కి జవాబు విరూపాక్ష. దయచేసి అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూ డండని రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమాలో నటించిన నటీనటు లు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు సాయంగా నిలబడిన డాక్టర్స్‌కి థాంక్స్. వారు నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చారు. మా ముగ్గురు మావయ్య లకు థాంక్స్. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తీసుకె ళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
గోపీచంద్ మలినేని మా ట్లాడుతూ.. ”విరూపాక్ష టీమ్‌కి కంగ్రాట్స్. వారెంత కష్టపడి, ఇష్టపడి సినిమా చేశారో వారి మాటలను వింటుంటే తెలు స్తుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడు తూ.. ”విరూపాక్ష సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. మా టీమ్‌ని అభినందించటానికి వచ్చిన మారుతి గారికి, గోపీచంద్ గారికి థాంక్స్. ఈ సినిమాలో మేజర్ టెక్ని కల్ గురించి అందరూ బాగా మాట్లాడారు. అయితే నేను కొం దరి గురించి చెప్పాలనుకుంటున్నాను. వారిలో మా కాస్ట్యూ మ్స్ డిజైనర్ రజినీగారు. అలాగే మా ఎడిటర్ నవీన్ గారు. ఆయనకు నేను మూడు గంటల సినిమా ఇస్తే ఆయన ఎక్కడా ఎలాంటి ఎమోషన్ మిస్ కాకుండా దాన్ని రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఎడిట్ చేసి ఇచ్చారు. అజనీష్ గారు గ్రేట్ వర్క్ ఇచ్చారు. అది కేవలం ఆరున్నర గంటల్లోనే చేయటం చాలా గొప్ప విషయం. సౌండ్ డిజైన్ చేసిన రాజా కృష్ణ, సచిన్‌లకు థాంక్స్. ఎక్స్‌ట్రార్డినరీ ఔట్‌పుట్ ఇచ్చారు. మా డైరెక్షన్ టీమ్ నా బలం. వాళ్లతో పాటు సతీష్ బొట్టగారికి థాంక్స్. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు.
హీరోయిన్ సంయుక్తా మీనన్ మాట్లాడుతూ.. ”విరూ పాక్ష సక్సెస్‌లో నాకు వస్తున్న స్పందనకు కారణం మా డైరెక్టర్ కార్తీక్‌గారే” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ మాట్లాడుతూ.. ”విరూపాక్ష సినిమా సక్సెస్ కావటం చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్ ఇచ్చిన అందరికీ ధన్య వాదాలు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు మా రుతి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, అజయ్, బ్రహ్మాజీ, రవి కృష్ణ, కమల్ కామరాజు, సాయిచంద్ తదితరులు మాట్లాడి సినిమా సక్సెస్ పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.