Thursday, September 5, 2024

Viraji | వరుణ్ సందేశ్ ‘విరాజి’ కి యూ/ఎ సర్టిఫికెట్…

ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా “విరాజి”. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక‌ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

మహా మూవీస్, ఎం3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించ‌గా… ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌తో పాటు రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలినీ పులప, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement