Tuesday, September 17, 2024

Thangalaan | సెన్సార్ ముగించుకున్న‌ విక్ర‌మ్ ‘తంగ‌లాన్’

పా.రంజిత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అప్‌కమింగ్ మూవీ ‘తంగళన్’. హిస్టారికల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement