Sunday, September 22, 2024

OTT | సైలెంట్ గా ఒటిటిలోకి తుపాన్….

బిచ్చ‌గాడు మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోని. అప్ప‌టి నుంచి ఆయ‌న న‌టించిన చిత్రాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతున్నాయి. విజ‌య్‌ న‌టించిన తాజా చిత్రం తుఫాన్‌.
ఎలాంటి చ‌డీచ‌ప్పుడు కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేసింది. విజయ్‌ మిల్టన్ ద‌ర్శ‌క‌త్వంలో ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా నిర్మించారు.

సత్యరాజ్, శరత్‌ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ లు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర్వాలేద‌నిపించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ప్ర‌స్తుతం త‌మిళ వ‌ర్షెన్ మాత్ర‌మే ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. తమిళంలో ఈ మూవీ ఆగ‌స్టు 2న విడుద‌ల చేశారు. వ‌చ్చేవారం నుంచి తెలుగులోనూ అందుబాటులోకి రానున్న‌ట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement