దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.
అయితే తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశానని… ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తక్కువ సేపు కనిపించినా తన నటన మామూలుగా ఉండదని… అంతేకాకుండా కొద్దిసేపు హైలెట్ గా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.