Saturday, June 29, 2024

NKR21 | పోలీసాఫీసర్ గా విజయశాంతి.. లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్..

YouTube video

లేడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతి గుర్తొస్తారు. ఆమె సృష్టించే ప్రభావం అలాంటిది. కథా బలం ఉన్న చాలా సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషించారు. అయితే రాజకీయాల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి… మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ‘‘కళ్యాణ్ రామ్ 21’’ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది.

ఈరోజు, విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా, ఆమె పాత్ర గ్లింప్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కూడా ఆమె పోలీసాఫీసర్‌గా నటిస్తోంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆమె పోలీస్ పాత్రలో నటిస్తోండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఇందులో కూడా ఆమె పాత్ర పేరు వైజయంతి ఐపీఎస్ కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement