Tuesday, November 26, 2024

విజ‌య్ వ‌ర్మ చాలా ప్ర‌త్యేకం.. రిలేష‌న్ లో ఉన్నాం.. త‌మ‌న్నా

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరో..హీరోయిన్స్ పై ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తుంటాయి. వాటిల్లో కొన్ని నిజ‌మ‌వుతాయి..మ‌రికొన్ని రూమార్స్ గానే మిగిలిపోతాయి. కాగా ఎప్ప‌టి నుండో హీరోయిన్ త‌మ‌న్నా న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ లో ఉంద‌న్న పుకార్లు పుట్టుకొచ్చాయి. కాగా ఎట్ట‌కేల‌కు త‌మ‌న్నా ఈ విష‌యంపై స్పందించింది. అవును న‌టుడు విజయ్ వర్మతో నా రిలేషన్ నిజమే అని కుండబద్దలు కొట్టింది హీరోయిన్ త‌మ‌న్నా. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని చెప్పారు. కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలా మంది హీరోలతో పని చేశాను. విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం.

నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయ్ వర్మ వచ్చాడు. అతనున్న ప్రదేశమే నాకు ఇష్టమైన ప్రదేశం, అని తమన్నా అన్నారు. దీంతో విజయ్ వర్మ-తమన్నా బంధంపై ముసుగు తొలిగిపోయింది. వారు డేటింగ్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. లస్ట్ స్టోరీస్ సీజన్ 2 జూన్ 29 నుండి స్ట్రీమ్ కానుంది. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ లో విజయ్ వర్మ సైతం భాగం కాగా తమన్నాతో ఆయనకు బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల కెరీర్లో అనేక మంది హీరోలతో పని చేసిన తమన్నా విజయ్ వర్మకు ఫ్లాట్ కావడం ఊహించని పరిణామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement