సినిమా నటులకు అభిమాన సంఘాలు ఏర్పడటం అనేది దక్షిణాలోనే ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రేక్షకుల నుండి ప్రారం భమైందని అంటారు. ఎన్టీఆర్, అక్కినేనికి తెలుగులో, ఎవ్జీు ఆర్, శివాజీగణేషన్కి తమిళంలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. కొత్త సినిమా రిలీజ్ అయినపుడు హంగామా చేయడం అభిమానులు చేస్తుంటారు. కానీ క్రమ క్రమంగా హీరోల గొప్పదనం మీద వాదోపవాదాలు చెలరేగేయి. హీరోల గొప్పదనం గురించి జరిగే చర్చలు దారితప్పేవి. ఒకరిపై ఒకరు దాడులు చేసేంతవరకు వెళ్లేవారు. ఈ పరిణామాలను గమనించిన నాటి హీరోలు తాము (హీరోలు) అందరం సఖ్యతతో ఉంటామని, అభిమానులు కూడా కలిసి ఉండాలని హితవు పలికేవారు. ఆ తర్వాత అభిమానుల మధ్య రగడ చాలా వరకు తగ్గింది. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణా మాలు అభిమానం మళ్లి దారితప్పినట్టుగా కనిపిస్తోంది. గతంలో కరపత్రాల ద్వారా ఎదిటిహీరోలను దుమ్మెత్తిపోసే వారు. కానీ ఇప్పుడు సాంకేతికత పెరగడంతో సోషల్ మీడి యా వేదికగా రభస జరుగుతోంది. తాము అభిమానించే హీరోని మరో హీరో మించిపోతున్నాడంటే చాలు అభిమానులు ఆ హీరోని నెట్టింట టార్గెట్ చేయడం, కించపరిచే విధంగా మీమ్స్ ని క్రియేట్ చేయడం వీడియోలని సృష్టించి సదరు హీరోపై కామెంట్ లు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. ఇక సోషల్ మీడియా ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి ఈ తరహా ట్రోలింగ్ పతాకస్థాయికి చేరుకుంటోంది. ఇది ఇప్పడు హద్దులు దాటి రాష్ట్రాలు దాటి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పర భాషా హీరోలని కూడా ఇప్పడు మనవారిలో కొందరు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తరువాత రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా కోల్డ్ వార్ నడిచింది.
అయితే తాజాగా తమిళ హీరో విజయ్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ వార్ నడుస్తోంది. మా హీరో మహేష్ గొప్ప అంటూ దళపతి విజయ్‌ని ఉద్దేశిస్తూ మహేష్ ఫ్యాన్స్ వీడియోలతో మీమ్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. రకరకాల వీడియోలను కూడా మార్ఫింగ్ చేస్తూ ఆనందిస్తున్నారు. షేర్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే మహేష్ నటించిన చాలా సినిమాలని విజయ్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. అవి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఒక్కడుని గిల్లిగా.. పోకిరిని పోక్కిరిగా.. రీమేక్ చేశారు. విజయ్ నటించిన ఈ సినిమాలు అక్కడ భారీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మహేష్ ఫ్యాన్స్ విజయ్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మా హీరో సినిమాల వల్లే ఇప్పడు మీ హీరో స్టార్ అయ్యాడని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఫ్యాన్ల వార్ చూసిన వారంతా సినీ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. విజయ్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది.
అభిమానులు తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలి. అభిమాన హీరోల సినిమాలు వస్తే చూసి ఆనందంచాలి. మరొకరిని కించరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సినీ వర్గాలు అంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.