Friday, September 20, 2024

GOAT | విజ‌య్ ‘గోట్’ ట్రైలర్ అప్‌డేట్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరమ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆగ‌ష్టు 17న సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక‌ మీనాక్షి చౌదరి, ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement